పశ్చిమ గోదావరి
వికీపీడియా నుండి
reklama1| ?పశ్చిమ గోదావరి ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 7,742 కి.మీ² (2,989 చ.మై) |
| ముఖ్య పట్టణము | ఏలూరు |
| ప్రాంతం | కోస్తా |
| జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
3,796,000 (2001) • 490/కి.మీ² (1,269/చ.మై) • 747000 • 1905999 • 1889999 • 73.95 • 78.43 • 69.45 |
అక్షాంశరేఖాంశాలు: పశ్చిమ గోదావరి జిల్లా, (West Godavari District) భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లాకు ఉత్తరాన ఖమ్మం జిల్లా, పశ్చిమాన కృష్ణా జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా, బంగాళాఖాతం లు సరిహద్దులుగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణము. విజయవాడ నుండి 100 కి.మీ.లు మరియు ఏలూరు నుండి 50 కి.మీ.లు దూరమున ఉన్న ఈ పట్టణములో 52% అక్షరాస్యత కలదు. తణుకు పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న పట్టణం. భీమవరం, పాలకొల్లు పట్టణాలు వ్యాపారాత్మకంగా వృద్ధిపొందుతున్న పట్టణాలు.
విషయ సూచిక |
[మార్చు] జిల్లా విశేషాలు
అక్షరాస్యతలో హైదరాబాదు తర్వాతి స్థానం పశ్చిమగోదావరిదే. జిల్లాలో 700 కి.మీ. వైశాల్యంగల కొల్లేరు సరస్సు ఉంది. అనేకరకాల పక్షులు అక్టోబరు - మే మాసాలలో ఇక్కడ చేరుతాయి. చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ఏలూరు సమీపాన ఉంది. యాత్రికులకు సమస్త సౌకర్యాలున్న ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి.
జిల్లాలోని అధిక ప్రాంతం సాంద్ర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, వ్యావసాయికంగా ఎంతో అభివృద్ధి సాధించి, ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధిచెందింది. జిల్లాలో మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. భీమవరం పట్టణం, రాష్ట్రంలోనే ప్రముఖ మత్స్య పరిశ్రమ వ్యాపారకేంద్రం. తణుకులో ఆంధ్రా సుగర్స్, అక్కమాంబ టెక్స్ టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వంటి పరిశ్రమలు కలవు.
[మార్చు] భౌగోళికం
భౌగోళికంగా ఈ జిల్లా 16 - 15' నుండి 17-30' ఉత్తర అక్షాంశాల మధ్య, 80-55' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. గోదావరి నది డెల్టాలో కొంత భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. మొత్తం జిల్లా వైశాల్యం 7,780 చ.కి.మీ. (19,26,277 ఎకరాలు). జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు. [1]. నైసర్గికంగా జిల్లాను మూడు సహజ ప్రాంతాలుగా విభజించవచ్చును -
- డెల్టా ప్రాంతము: నరసాపురం, తణుకు, కొల్లేరు ప్రాంతాలు
- మెరక భూముల ప్రాంతము: పెదవేగి, చింతలపూడి చుట్టుప్రక్కల
- ఏజన్సీ (అటవీ) ప్రాంతము: పోలవరం,జంగారెడ్డీగూడేం చుట్టుప్రక్కల
డెల్టా ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదుల కాలవలు ప్రధానమైన నీటి వనరులు. పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు ఈ జిల్లాలోనే ఉన్నది. మెరక భూములలో ఇటీవల విస్తారంగా కరంటు బావుల ద్వారా వ్యవసాయం జరుగుతున్నది. ఏజన్సీ ప్రాంతంలోనూ, మెరక ప్రాంతంలోనూ చిన్న, పెద్ద సాగునీటి ప్రాజెక్టులు నీటిని అందిస్తున్నాయి.
జిల్లాలో అటవీ ప్రాంతం 81,200 హెక్టేరులు - మొత్తం వైశాల్యంలో షుమారు 10.5%. సాగు అవుతున్న భూమిలో అధిక భాగం వరి పంట (82.8%), తరువాత పుగాకు (4.9%), చెరకు (4.7%), మిర్చి (1.3%)[2].
[మార్చు] చరిత్ర
బౌద్ధుల కాలంనుండీ ఇక్కడి చరిత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయి. కామవరపుకోట మండలం జీలకర్రగూడెం, గుంటుపల్లిలలో ఉన్న బౌద్ధారామాలు క్రీ.పూ 200 నుండి క్రీ.శ. 300 మధ్యకాలానికి సంబంధించినవి. బుద్ధుని ప్రతిమలేవీ లేకపోవడం వలన ఇవి ముఖ్యంగా 'హీనయానం' (బౌద్ధం ఆరంభ సమయం) కాలానికి చెందినవని అనిపిస్తున్నది. భీమవరం దగ్గర పెదమిరం గ్రామంలోను, పెనుమంచిలి, ఆచంట లలోనూ జైన తీర్ధంకరుల మందిరాలున్నాయి. [3]
ప్రస్తుతం పశ్చిమ గోదావరిగా పిలువబడే ప్రాంతం చారిత్రికంగా నందుల సామ్రాజ్యంలోనూ, తరువాత అశోకుని సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేది. తరువాత మిగిలిన దక్షిణ దేశంలాగానే (క్రీ.శ. 1 నుండి 3వ శతాబ్దం వరకు) ఇది కూడా శాతవాహనుల యేలుబడిలోకి వచ్చింది. క్రీ.శ.350 ప్రాంతంలో సముద్రగుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తాడు. తరువాత మహారాజు శక్తి వర్మతో ఆరంభమైన మఠరకుల వంశం వారు క్రీ.శ. 375 నుండి 500 వరకు ఆంధ్ర తీర ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత రెండు శతాబ్దాలు పిఠాపురం (పిష్టపురం) కేంద్రంగా విష్ణు కుండినులు ఈ తీర ప్రాంతంలో రాజ్యపాలన చేశారు. వీరిలో విక్రమేంద్ర వర్మ ముఖ్యమైనవాడు. విక్రమేంద్ర వర్మ ప్రతినిధిగా రణ దుర్జయుడు పిఠాపురం నుండి పాలన చేశాడు. ఇంద్ర భట్టారకుడనే విష్ణు కుండిన రాజును జయించి, కళింగ గంగులు వారి రాజ్యంలో చాలా భాగాన్ని ఆక్రమించారు. 3వ మాధవ వర్మ విష్ణు కుండినులలో చివరి రాజు.
తరువాత బాదామి చాళుక్యుల (పశ్చిమ చాళుక్యులు) వంశానికి చెందిన 2వ పులకేశి సోదరుడైన కుబ్జవిష్ణువు పిఠాపురాన్ని జయించి ఇక్కడ చాళుక్యుల పాలనకు నాంది పలికాడు. కుబ్జ విష్ణునితో తూర్పు చాళుక్య పాలన మొదలయ్యింది. వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి వేంగికి, తరువాత రాజమహేంద్ర వరం|రాజమండ్రి కి మార్చబడింది. క్రీ.శ. 892-921 మధ్య రాజైన 1వ చాళుక్య భీముడు ద్రాక్షారామ శివాలయాన్ని నిర్మించాడు.కాకతీయ వంశ జ రాణి రుద్రమదేవి నిర్వర్జ్యపురము అనబడే ఈనాటి నిడదవోలును రాజధానిగా పాలించిన చాళిక్యులఇంటి కోడలు. తరువాత వివిధ రాజుల రాజ్యాలు సాగాయి.
బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794 లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904 లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942 లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.[4]
[మార్చు] ఈ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు
[మార్చు] పాలనా విభాగాలు
- డివిజన్లు
- రెవిన్యూ డివిజన్లు (4): ఏలూరు, కొవ్వూరు, నరసాపురం,జంగారెడ్డిగూడెం
- లోక్‌సభ స్థానాలు (2): ఏలూరు, నరసాపురం
- శాసనసభ స్థానాలు (16): ఆచంట, గోపాలపురం, పోలవరం, నరసాపురం, ఏలూరు, పాలకొల్లు, భీమవరం, ఉండి, పెనుగొండ, తణుకు, అత్తిలి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, కొవ్వూరు, చింతలపూడి.
- ముఖ్యమైన పట్టణాలు : ఏలూరు, తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం
- మండలాలు
భౌగోళికంగా పశ్చిమ గోదావరి జిల్లాను 46 రెవిన్యూ మండలములుగా విభజించినారు.[5]
![]() |
||
| 1 జీలుగుమిల్లి | 17 నిడదవోలు | 33 ఉండి |
| 2 బుట్టాయగూడెం | 18 తాడేపల్లిగూడెం | 34 ఆకివీడు |
| 3 పోలవరం | 19 ఉంగుటూరు | 35 కాళ్ళ |
| 4 తాళ్ళపూడి | 20 భీమడోలు | 36 భీమవరం |
| 5 గోపాలపురం | 21 పెదవేగి | 37 పాలకోడేరు |
| 6 కొయ్యలగూడెం | 22 పెదపాడు | 38 వీరవాసరము |
| 7 జంగారెడ్డిగూడెం | 23 ఏలూరు | 39 పెనుమంట్ర |
| 8 టి.నరసాపురం | 24 దెందులూరు | 40 పెనుగొండ |
| 9 చింతలపూడి | 25 నిడమర్రు | 41 ఆచంట |
| 10 లింగపాలెం | 26 గణపవరం(ప.గో) | 42 పోడూరు |
| 11 కామవరపుకోట | 27 పెంటపాడు | 43 పాలకొల్లు |
| 12 ద్వారకా తిరుమల | 28 తణుకు | 44 యలమంచిలి |
| 13 నల్లజర్ల | 29 ఉండ్రాజవరం | 45 నరసాపురం |
| 14 దేవరపల్లి | 30 పెరవలి | 46 మొగల్తూరు |
| 15 చాగల్లు | 31 ఇరగవరం | |
| 16 కొవ్వూరు | 32 అత్తిలి |
[మార్చు] జన విస్తరణ
పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. (ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలోను, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివశిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490[6]. జనాభాలో 70% పైగా జనులు వ్యవసాయ సంబంధితమైన ఉపాధిపై జీవిస్తున్నారు.
- ఇతర ప్రధాన జన విస్తరణాంశాలు (2001 జనాభా లెక్కలననుసరించి)
- జనాభా: 37.96 లక్షలు (పురుషులు 19.06 లక్షలు, స్త్రీలు 18.9 లక్షలు)
- దశాబ్దంలో జనాభా పెరుగుదల: + 7.92%
- జన సాంద్రత: చ.కి.మీ.కు 490 మంది
- అక్షరాస్యత: 73.95% (పురుషులలో 78.4%, స్త్రీలలో 69.4 %)
- సాపేక్ష అభివృద్ధి సూచిక : 20.71
- మొత్తం జనాభాలో పని చేసేవారు: 43.4%
- వ్యవసాయ సంబంధిత ఉపాధిలో : 71.2%
- గనుల పనులలో : 0.2%
- పరిశ్రమలలో: 5.1% (కుటీర పరిశ్రమలు మినహాయించి)
- కుటీర పరిశ్రమలలో: 2.21%
- నిర్మాణం పనులు: 1.01%
- సేవా రంగంలో: 19.5%
- మొత్తం వైశాల్యంలో అడవులు 10.38%
- వ్యవసాయం జరిగే భూమిలో నీటి వసతి ఉన్నది: 86.5%
- తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి: 383 కి.గ్రా.
- ప్రతి 100 చ.కి.మీ.కు రోడ్ల పొడవు: 77.42 కి.మీ.
[మార్చు] ఆర్ధిక రంగం
[మార్చు] వ్యవసాయం
జిల్లా ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైనా, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు. వరి, చెరకు, పుగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు పూలు - ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు. జిల్లాలోని వివిధ పంటల విస్తీర్ణం క్రింద ఇవ్వబడింది[7].
| పశ్చిమ గోదావరి జిల్లాలో పంటలు | ||
| పంట | విస్తీర్ణం
హెక్టేరులు |
ఉత్పత్తి
మెట్రిక్ టన్నులు |
| వరి | 219.6 వేల హె. | 1,413,108 |
| మొక్కజొన్న | 11.5 వేల హె. | 39,557 |
| కంది | 0.28 వేల హె. | 191 |
| మినుము | 9.54 వేల హె. | 3,885 |
| పెసర | 2.79 వేల హె. | 1,130 |
| వేరుశనగ | 3.21 వేల హె. | 6,476 |
| చెరకు | 32.22 వేల హె. | 2,900,000 |
| పుగాకు | 5.76 వేల హె. | 12,685 |
| మామిడి | 20,483 హె. | 1,22,898 |
| నిమ్మ | 1,449 హె. | 11,592 |
| బత్తాయి | 183 హె. | 1,464 |
| అరటి | 5,021 హె. | 3,26,365 |
| జామ | 657 హె. | 13,140 |
| సపోటా | 568 హె. | 4,544 |
| జీడిమామిడి | 44,744 హె. | 22,372 |
| పసుపు | 530 హె. | 1,855 |
| మిరప | 2,703 హె. | 5,406 |
| తమలపాకు | 175 హె. | 700 |
| కొబ్బరి | 22,183 హె. | 3,327లక్షలు |
| పామాయిల్ | 10,250 హె. | 61,500 |
| కోకో | 2,800 హె. | 1,400 |
| పోక చెక్క | 125 హె. | 125 |
| కాఫీ | 50 హె. | 25 |
| మిరియం | 150 హె. | 45 |
ఈ పంటలలో వరి, చెరకు సాగు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో సాగుతుంది. అపరాలు ఎక్కువగా డెల్టా ప్రాంతంలో అంతర పంటగా పండిస్తారు. మొక్కజొన్న, పుగాకు, కొబ్బరి వంటివి మెరక ప్రాంతంలోనూ, పల్లపు ప్రాంతంలోనూ కూడా పండుతాయి. జీడిమామిడి, మామిడి, నిమ్మ వంటి తోటల వ్యవసాయం అధికంగా మెరక ప్రాంతంలో జరుగుతుంది.
జిల్లాలోని డెల్టా ప్రాంతలో సారవంతమైన నల్లరేగడి నేల ఉన్నది. కొద్దిభాగం పాటి నేల. ఎక్కువ భాగం ఎర్ర చెక్కు నేల, ఇసుక నేల కలిసి ఉన్నది. మొత్తం జిల్లాలోని 7.7 లక్షల హెక్టేరుల వైశాల్యంలో షుమారు 5.5 లక్షల హెక్టేరులు వ్యవసాయానికి అనుకూలమైన భూమి. 0.8 లక్షల హెక్టేరులు అడవి ప్రాంతము. 0.45 లక్షల హెక్టేరులు బీడు భూములు. 0.94 హెక్టేరులు ఇతర ఉపయోగాలకు వాడుతున్నారు. 1996-97లో మొత్తం 6 లక్షల హెక్టేరులలో వ్యవసాయం జరిగింది[8].
వ్యవసాయానికి అనుబంధంగా సాగే పశుపాలన కూడా జిల్లా ఆర్ధిక వ్యవస్థలో ముఖ్యభాగం వహిస్తున్నది. జిల్లాలో 2.5 లక్షల ఆవులు, 4.2 లక్షల గేదెలు, 75వేల గొర్రలు, లక్ష మేకలు, 30 వేల పందులు, 84 లక్షల కోళ్ళు పెంచబడుతున్నాయని అంచనా.[8]
[మార్చు] నీటి వనరులు
జిల్లాలో సరాసరి సంవత్సర వర్షపాతం 1076.2 మి.మీ. ఇందులో షుమారు 64% వర్షపాతం నైరుతి ఋతుపవనాల సమయంలో (జూన్-సెప్టెంబరు కాలం) ఉంటుంది.
జిల్లాకు తూర్పు హద్దుగా ఉన్న గోదావరి నది విజ్జేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి అనే రెండు పాయలుగా చీలుతుంది. అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఎర్రకాలువ, తమ్మిలేరు, బైనేరు, కొవ్వాడ కాలువ, జల్లేరు, గుండేరు ఇతర ప్రవాహ నీటి వనరులు. జిల్లాలో దాదాపు 20.2% నేల గోదావరి నది పరీవాహక ప్రాంతంలోనూ, 48.1 % యెర్రకాలువ పరీవాహక ప్రాంతంలోను, 26.8% తమ్మిలేరు ప్రాంతంలోను, 1.4% రామిలేరు ప్రాంతంలోను, 3.5% లోయేరు ప్రాంతంలోను ఉన్నది.[8].
245 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి, దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు కృష్ణా, గోదావరి నదుల మధ్యప్రాంతలో ఏర్పడిన పల్లపు జలాశయం. ఈ రెండు నదుల మధ్యలోను సహజంగా వరద నీటిని బాలన్స్ చేసే సరస్సుగా ఉపయోగ పడుతుంది. బుడమేరు, తమ్మిలేరు అనే రెండు పెద్ద యేరులతోబాటు షుమారు 30 చిన్న, పెద్ద కాలువలు కొల్లేరులో కలుస్తాయి. ఉప్పుటేరు ద్వారా కొల్లేరు నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఎన్నో ప్రత్యేకమైన వృక్ష, పక్షిజాతులకు ఇది ఆలవాలమైంది. ఇటీవలి కాలంలో ఇక్కడ చేపల పెంపకం పెద్దయెత్తున ఆర్ధిక, సామాజిక మార్పులను తెచ్చింది. అక్రమంగా కొల్లేరు భాగాలను వ్యవసాయానికి, ఆక్వా కల్చర్‌కు ఆక్రమించుకోవడం వలన కొల్లేరు మనుగడకే ప్రమాదం ఏర్పడింది[9].
జిల్లాలో వ్యవసాయానికి నీరందించేవాటిలో మూడు వ్యవస్థలు ఉన్నవి:
- గోదావరి డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (సర్ అర్ధర్ కాటన్ బారేజి ద్వారా - 2,10,000 హెక్టేరుల వరకు అవకాశం ఉన్నది.)
- కృష్ణా డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (ప్రకాశం బారేజి ద్వారా - 23,000 హెక్టేరుల వరకు అవకాశం ఉన్నది.)
ఇవి కాక తమ్మిలేరు రిజర్వాయరు ద్వారా 3,700 హెక్టేరులు, జల్లేరు రిజర్వాయరు ద్వారా 1,700 హేక్టేరులు సాగుకు అవకాశం ఉన్నది.[10]
మెరక ప్రాంతంలో పెద్దయెత్తున గొట్టపు బావులద్వారా సాగునీరు వినియోగం జరుగుతున్నది.
- పోలవరం ప్రాజెక్టు
[మార్చు] పరిశ్రమలు
పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధి చెందిందనడానికి ఆస్కారం లేదు. అందువలన ఉద్యోగావకాశాలు కూడా చాలా తక్కువని చెప్పవచ్చును. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఈ జిల్లాలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కూడా వ్యవసాయాధారితమైనవే.
జిల్లాలో ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లులలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. మొత్తం జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఇలా ఉన్నాయి[7]:
- లో టెన్షన్ (తక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 7125
- హై టెన్షన్ (ఎక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 118
- కుటీర పరిశ్రమ పారిశ్రామిక కనెక్షన్లు: 251
- జిల్లాలో మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు: 13,541
- పరిశ్రమలకు విద్యుత్తునిచ్చే ప్రధాన విద్యుత్ సరఫరా లైనులు, హై వోల్టేజీ సబ్‌స్టేషనులు ఉన్న స్థలాలు: నిడదవోలు, కొవ్వూరు, తణుకు, భీమవరం, దూబచర్ల, తాడిమళ్ళ, చాగల్లు, తాడేపల్లి గూడె, పాలకొల్లు, ఏలూరు.
మొత్తం జిల్లాలో 52 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలున్నాయి. వీటిలో షుమారు 17వేల మందికి ఉపాధి లభిస్తున్నది. జిల్లాలోని ముఖ్య పరిశ్రమలు:
- అంబికా దర్బార్ బత్తి - ఏలూరు
- ఆంధ్రా షుగర్స్ - తణుకు
- గౌతమి సాల్వెంట్స్ - తణుకు
- ఫుడ్స్, ఫాట్స్ & ఫెర్టిలైజర్స్ - తాడేపల్లిగూడెం
- శ్రీ గురువాయురప్పన్ రైస్ బ్రాన్ ఆయిల్, గణపవరం
- పశ్చిమ గోదావరి సహకార చక్కెర ఫాక్టరీ - సూరప్పగూడెం
- ఆంధ్రా షుగర్స్ (ఆల్కహాలు విభాగం) - కొవ్వూరు
- సహకార చక్కెర ఫాక్టరీ, పాలకొల్లు
- విజయదుర్గా ఆగ్రో ఆయిల్స్ & స్ట్రా బోర్డు - తణుకు
- వి.వి.ఎస్.షుగర్స్, చాగల్లు
- పద్మజా ఎడిబుల్ రైస్ సాల్వెంట్ ఆయిలగ, ఉండి
- రీజెంట్ ఆగ్రో ప్రొడక్ట్స్ - దేవరపల్లి
- ఆంధ్రా షుగర్స్ - తాడ్వాయి
- గోద్రెజ్ ఆగ్రోవెట్ - ద్వారకా తిరుమల
- సహకార పామ్ ఆయిల్ - పెదవేగి
- గవర్నమెంట్ డిస్టిలరీ - చాగల్లు
- శ్రీ ఇంద్ర డిస్టిలరీ - తణుకు
- సదర్న్ పెస్టిసైడ్స్ - కొవ్వూరు
- శ్రీ రామా డిస్టిలర్స్ - జంగారెడ్డి గూడెం
- కృష్ణా ఇండస్ట్రియల్ కార్బన్ - జంగారెడ్డిగూడెం
- కృష్ణా ఇండస్ట్రియల్ సల్ఫ్యూరిక్ ఆసిడ్ - నిడదవోలు
- డాక్టర్స్ ఆర్గానిక్ - తణుకు
- శుభోదయ కెమికల్స్ - గౌరీ పట్నం (దేవరపల్లి)
- ఆంధ్రా షుగర్స్ (కాస్టిక్ సోడా) - గోపాలపురం
- డెల్టా పేపర్ మిల్స్ - వెండ్ర
- కోస్టల్ కెమికల్స్ - నిడదవోలు
- రోలెక్స్ పేపర్స్ - పాలకొల్లు
- కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ - ఉండ్రాజవరం
- శ్రీ సత్యనారాయణ కాటన్ యార్న్ - తణుకు
- శ్రీ అనంతలక్ష్మీ కాటన్ యార్న్ - ఉండ్రాజవరం
- శ్రీ అక్కమాంబా టెక్స్టైల్స్ - తణుకు
- శ్రీ రామభద్ర స్పిన్నర్స్ - తణుకు
- శ్రీ వెంకటరాయ కాటన్ యార్న్ - తణుకు
- ఈస్ట్ ఇండియా కమర్షియల్ (జూట్ మిల్లు) - ఏలూరు
- కృష్ణా హెస్సియన్ - ఏలూరు
- సదరన్ మెగ్నీషియం మెటల్ - దేవరపల్లి
- కళ్యాణి ఫ్లోరైడ్ - నిడదవోలు
- ఎన్.సి.ఎల్. ఇండస్ట్రీస్ - దొమ్మేరు (నిడదవోలు)
- త్రివేణి గ్లాస్ వర్క్స్ - కొవ్వూరు
- దేవి సీ ఫుడ్స్ - పెరవలి
- అవంతి ఫీడ్స్ - కొవ్వూరు
- శ్రీ వీరభద్రా మెటల్ ఇండస్ట్రీస్ - అజ్జరం
ఇవి కాక జిల్లాలో ఈ క్రింది కుటీర పరిశ్రమలు చిన్నపరిశ్రమలు కొన్ని పట్టణాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.
- తివాచీ పరిశ్రమలు - ఏలూరు
- ఇత్తడి పనిముట్లు - అజ్జరం, పెరవలి
- లేసులు - నరసాపురం
- స్టోన్ క్రషింగ్ యూనిట్లు - దేవరపల్లి
- పీచు పరిశ్రమలు - నిడదవోలు
[మార్చు] సేవా రంగం, వ్యాపారం
[మార్చు] నీలి విప్లవం
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి, దక్షిణం వైపున 19.5 కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు. చేపల అధికోత్పత్తి, వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు. 1961 నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి. నాడు 460 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1969-70 మధ్య రూ. 10.25 లక్షల విలువైన 471 టన్నుల చేపలు, రూ. 1.61 లక్షల విలువ చేసే 73 టన్నుల రొయ్య అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే మత్స్యపరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం 42 ఫిషర్‌మేన్ కోఆపరేటివ్ సొసైటీలు 5805 మంది సభ్యులతో ఏర్పడ్డాయి. 1981 నాటికి ఆ సంఖ్య 61 సొసైటీలకు పెరిగింది. 1960లో బాదంపూడిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెదఅమిరం, నరసాపురం, కొవ్వలి, తణుకు, ఏలూరు, కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి.
- 80వ దశకం నుంచి విప్లవాత్మక మార్పులు
శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం 1980 నుంచి ప్రారంభమైంది. తొలుత జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు పంట ప్రాంతాలుగా చేపల పెంపకం విస్తరించింది. ప్రారంభంలో 20 వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు 1985-86 ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవుతుండటంతో ఒకేసారి మరో 10 వేల ఎకరాలకు విస్తరించింది. భీమవరం, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురంలలో చేపల చెరువులు బాగా విస్తరించాయి. ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనంద గ్రూపు-అమాల్‌గమ్ ఫిషరీస్ సంయుక్తంగా 1988లో కొత్త పద్ధతులను, ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి. అప్పటి వరకు ఒక మోస్తరుగా రైళ్ళ ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి. తదుపరి ప్యాకింగ్‌తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది. అస్సాం, ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో 500 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి.
- ప్రభుత్వ ప్రోత్సాహం
ఈ దశాబ్దంలోనే ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల 1985 నాటికిఉప్పునీటి చేపల ఉత్పత్తి 4 వేల టన్నులు, మంచినీటి చేపల ఉత్పత్తి 10546 టన్నులకు పెరిగింది. ఏడో పంచవర్ష ప్రణాళికలో ఈ పరిశ్రమ అభివృద్ధికి చెరువుల తవ్వకం, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు, మత్స్య క్షేత్రాలను చేపట్టారు. ఈ పథకాలకు అప్పట్లో రూ. 7.13 కోట్లు కేటాయించారు. మత్స్యకారులకు గృహాలు, పడవలు అందించారు. రూ. 1.7 కోట్లతో చేపల మార్కెట్ అభివృద్ధి సౌకర్యాల కల్పనకు వెచ్చించారు. 1990 నాటికి జిల్లాలో ఏలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, తణుకు, పడాల, కొవ్వలి ప్రాంతాలలో 200 టన్నుల ఐస్‌ను ఉత్పత్తి చేసే 24 ఫ్యాక్టరీల ఉత్పత్తిని పెంచుతూ నెలకొల్పారు. 1990 ప్రాంతంలో మరో 50వేల ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు హరిత విప్లవం నుంచి నీలి విప్లవం వైపు మరలాయి.
- తాజా పరిణామాలు
రెండున్నర దశాబ్దాలలో 20 వేల ఎకరాల నుంచి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి. 1990 నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 7054 చెరువులు ఉండగా 20 వేలకు పెరిగినట్లు అంచనా. ఒక్క గణపవరం, నిడమర్రు, ఆకివీడు మండలాలలో గతంలో 35 లారీల చేపలు కలకత్తా మార్కెట్‌కు రోజూ వెళ్ళేవి. ప్రస్తుతం రోజుకి 1250 లారీల్లో చేపలు ఎగుమతి అవుతున్నాయి.
[మార్చు] రవాణా సౌకర్యాలు
5వ నెంబరు జాతీయ రహదారి పశ్చిమ గోదావరి జిల్లా గుండా వెళుతుంది. జిల్లాలో రోడ్ల వివరాలు [7]:
- మొత్తం రోడ్ల పొడవు: 5,194 కి.మీ. అందులో
- జాతీయ రహదారి: 108 కి.మీ.
- రాష్ట్రం రహదారులు: 281 కి.మీ.
- జిల్లా స్థాయి రోడ్లు: 1308 కి.మీ.
మద్రాసు-కొలకత్తా రైలు మార్గం ఈ జిల్లాగుండా వెళుతుంది. ట్రంకు రైలు మార్గం పొడవు 90 కి.మీ. బ్రాంచి లైను పొడవు 75 కి.మీ. జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషనులు: ఏలూరు, నిడదవోలు (జంక్షన్), భీమడోలు, కొవ్వూరు
జిల్లాలో కాలువల ద్వారా ప్రయాణం, సరకుల రవాణా పెద్దగా జరగడం లేదు. గోదావరి డెల్టాలో కొంత వినియోగం జరుగుతున్నది.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలాగానే ప్రయాణికుల నిత్యావసరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారి బస్సు సర్వీసులే ప్రధాన ప్రయాణ సాధనాలు. కొంత వరకు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. పట్టణ పరిసర గ్రామాలలో ఆటోల వినియోగం ఇటీవల బాగా పెరిగింది.
[మార్చు] పర్యాటక స్థలాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో పెక్కు పర్యాటక స్థలాలున్నాయి. [3] వాటిలో ముఖ్యమైన కొన్ని స్థలాల సంక్షిప్త వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
[మార్చు] పుణ్య క్షేత్రాలు
భీమవరం - ఇది పంచారామాల లో ఒకటి. ఇక్కడ భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి మందిరాలున్నాయి. పట్టణంలో పెద్ద ప్రకృతి వైద్యశాల ఉంది.
ద్వారకా తిరుమల - చిన్న తిరుపతి గా ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఒక శివాలయం, సంతాన వేణు గోపాల స్వామి ఆలయం, కుంకుళ్ళమ్మ ఆలయం ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ఏలూరుకు 40 కి.మీ. దూరంలో ఉన్నది.
పాలకొల్లు - ఇది కూడా పంచారామాలలో ఒకటి. క్షీరా రామ లింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడి ప్రధానాలయం.
పట్టిసీమ - కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్నది. చారిత్రకంగానూ, ఆధ్యాత్మికంగానూ విశేషమైన స్థానం. పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్ర ఆలయం, భావనారాయణ ఆలయం ఉన్నాయి.
జుత్తిగ, నత్త రామేశ్వరం (దక్షిణ కాశి): ఇవి జంట గ్రామాలు. శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి స్వయంభూలింగం ఉన్న మందిరం ఉన్నది. నత్తలతో నిర్మితమైన నత్త రామేశ్వర స్వామి లింగం కూడా ఉన్నది. ప్రతి శివరాత్రికీ ఈ రెండు గ్రామాల మధ్య ఎదురుకోలు ఉత్సవం పెద్ద యెత్తున జరుపుతారు.
పెనుగొండ - ఇక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయం సుప్రసిద్ధం. ప్రధానంగా ఆర్య వైశ్యులకు ఈ తల్లి కులదేవత.
ఖండవల్లి - తణుకు దగ్గర ఒక పల్లెటూరు. వశిష్ట గోదావరీ తీరాన ఉన్న పురాతన స్థలం. మార్కండేయ-మృకండేశ్వర ఆలయంలో ఐదు శివలింగాలున్నాయి కనుక ఇది పంచలింగ క్షేత్రం. ఇలా ఐదు శివ లింగాలు ఇంకా వారాణసిలోను, రాజమండ్రిలోను మాత్రమే ఉన్నాయి.
[మార్చు] ప్రకృతి సౌందర్యాలు
జిల్లా మొత్తం ఎటువైపు వెళ్ళినా చల్లగా పలకరించే పచ్చని పంటచేలు - విస్తృతంగా దిగుబడినందిస్తూ పచ్చగా కళకళలాడే కొబ్బరి తోటలు - అమృతమధురమైన ఫలాలందించే అరటి వనాలు - గోదారి గలగలలు - పంటచేల పదనిసలు - పశ్చిమగోదావరి....కాదు...కాదు.. ఇది ప్రకృతి గోదావరి
- కొల్లేరు సరస్సు: పశ్చిమ గోదావరి - కృష్ణా జిల్లాల మధ్య విస్తరించిన మంచినీటి సరస్సు. ఇదివరకు 193 జాతుల పక్షులకు ఇది ఆవాసం కాని ఇప్పుడు చాలా పక్షులు కనిపించడంలేదు. ఈజిప్టు, సైబీరియా, ఫిలిప్పీన్స్, అరేబియా, ఆస్ట్రేలియా ప్రాంతాలనుండికూడా కొన్ని పక్షులు ఆక్టోబరు నెలలో ఇక్కడికి వలస వచ్చి, మళ్ళీ మార్చ్-ఏప్రిల్ కాలంలో తిరిగివెళతాయి. వీటిలో కొల్లేటి కొంగ బాగా ప్రసిద్ధం.
- పాపిక

